పవన్‌ ని వదలం..ఇది ఫిక్స్‌..!

203
very special publicity program for katamarayudu
- Advertisement -

సిని ఇండస్ట్రీలో పవన్‌ కు ఏ రేంజ్‌ లో క్రేజ్‌ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా పవన్‌ సినిమాలకు జేజేలు కొట్టేవారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా పవన్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ టీజర్‌ సోషల్‌ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ సంచలనమే ఓ సంస్థకి ప్లస్‌ పాయింట్‌ కాబోతోంది.

తాజాగా కాటమరాయుడు చిత్ర నిర్మాత శరత్ మరార్ తన సినిమా పబ్లిసిటీ కోసం ముంబైకి చెందిన వెబ్ జియర్ సంస్థను సంప్రదించినట్టు సమాచారం. ఈ సంస్థ ఆల్రెడీ  టాలీవుడ్‌‌లో ఎంట్రీకోసం ప్రయత్నిస్తోంది. అదేటైంలో శరత్ మరార్ ఇప్పుడీ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. పెద్ద సినిమాలు, ప్రిస్టేజియస్ ప్రాజెక్టులకు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయిన ఈ సంస్థకు ఈ చిత్రం లభించడంతో సంతోషం పట్టలేకపోయింది.
very special publicity program for katamarayudu
అంతేకాకుండా..కాటమరాయుడు టీజర్‌ తో పాటు, రీసెంట్‌ గా రిలీజైన మిర మిరా మీసం అంటూ సాగే పాటకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆ సంస్థ షాక్‌తిందని టాక్‌. ఇక ఇలాంటి ఆఫర్‌ ని వదులుకుంటే మాత్రం తప్పు  చేసినట్టే అని భావించిన ఆ సంస్థ పవన్‌ ని  వదలకూడదని డిసైడైపోయిందట.

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంకోసం లోకల్ సంస్థను తీసుకున్నారు శరత్ మరార్. ఇదిలా ఉంటే.. పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ అకౌంటును హ్యాండిల్ చేసే  సంస్థ కూడా ఇదే అంటున్నారు.

- Advertisement -