- Advertisement -
సాంప్రదాయాలకు విరుద్దంగా కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్. ఏళ్ల తరబడి నుండి ఉంటున్న ప్రతిపక్ష నేత ఛాంబర్‌ని మార్చేసింది. చిన్న రూమ్‌ని కేటాయించింది రేవంత్ సర్కార్. ఇప్పటివరకు ఇన్నర్ లాబీలో ప్రతిపక్ష నేత కార్యాలయం ఉండగా ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదికి మార్చేసింది.
దీనిని తప్పుబట్టారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి.మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్‌ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చినది చాలా చిన్నదిగా ఉన్నదని అన్నారు. ప్రతిపక్ష నేతను అవమానించేలా ప్రభుత్వ చర్య ఉందని విమర్శించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
Also Read:ఆరు గ్యారెంటీలకే అన్ని వేల కోట్లా?
- Advertisement -