ఫోన్ లు వేలల్లో, లక్షల్లోనే కాదు.. అంతకంటే ఖరీదైన ఫోన్లు కొన్ని మార్కెట్లలో ఉన్నాయట. లగ్జరీ మొబైల్ ఉత్పత్తుల సంస్థ వర్చూ నుంచి విడుదలైన ఫోన్ల ధరలు రూ. లక్షల్లో ఉంటాయి. అయితే తాజాగా ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌ను విడుదల చేసింది. దాని ధర అక్షరాల రూ. 2.3కోట్లకు పైమాటే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ వర్చూ సిగ్నేచర్ కోబ్రా ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. పరిమిత ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర 3.6లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2.3కోట్లకు పైమాటే. ఇంత ధర ఉందంటే.. ఈ ఫోన్లో ఏమైనా వజ్రాలను అమర్చారా అనుకుంటున్నారా? అలాంటిదేనండీ, ఈ ఫోన్ తయారీలో 439 కెంపులను ఉపయోగించారట. అంతేగాక, పేరుకు తగ్గట్టుగా ఫోన్ చుట్టూ పాము బొమ్మను తీర్చిదిద్దారు. పాము కళ్లను పచ్చలతో అమర్చారు.
ఈ ఫోన్‌ను యూకేలో తయారుచేశారు. ఇప్పటివరకు కేవలం 8 ఫోన్లను మాత్రమే సంస్థ రూపొందించినట్లు చైనాకు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఇక ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
– 2 అంగుళాల డిస్‌ప్లే
– 2 జీబీ రామ్
– 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్