అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌పై సీబీఐ ప్రత్యేకన్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. బాబాను దోషిగా తేల్చిన న్యాయస్ధానం తీర్పును ఈ నెల 28కి వాయిదా వేసింది. గుర్మీత్‌కు దాదాపు ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుర్మీత్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అంబాలా సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ తీర్పుతో పంజాబ్,హర్యానాలో హైటెన్షన్ నెలకొంది.
వెన్నునోప్పి ఉన్న తాను కోర్టుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన గుర్మిత వేలాది అనుచరులతో కోర్టుకు ర్యాలీగా బయలుదేశారు. చట్టాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తానని… దేవుడుపైన నాకు పూర్తి నమ్మకం ఉంది. శాంతి కలుగుగాకా’ అని రామ్ రహీమ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
ఇదిఇలా ఉండగా గుర్మిత్ కోర్టుకు హాజరువతుండటం లక్షలాదిగా ఆయన అనుచరులు పంచకుల కోర్టుకు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పంజాబ్ ,హర్యానాలో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలు మోహరించారు.
పంజాబ్, హరియాణా, చండీగఢ్‌లలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పంచకుల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాకు రాకపోకలు సాగించే అన్ని బస్సులను నిలిపివేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్‌ల సహాయంతో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. చంఢీగఢ్‌లోని క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చేశారు
2002లో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడినట్లు రామ్ రహీమ్‌పై కేసు నమోదైంది. ఓ జర్నలిస్టు హత్యకేసులోనూ ఈయన నిందితుడు. అత్యాచారం కేసులో విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. 15 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది.
హకీకత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌పై సంత్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు సామజిక స్పూర్తితో, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తప్పు దోవ పడుతున్న నేటి యవతరం కోసం ‘యంయస్‌జి’ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ . దీనికి సీక్వెల్‌గా ‘యంయస్‌జి-2’ ది మెసెంజర్ చిత్రాన్ని తెరకెక్కించగా మొదటి వారంలోనే ఈ చిత్రం 102.88 కోట్లు కలేక్ట్ చేసి మరోసారి రికార్డు బ్రేక్ చేసింది.