సినీ నటుడు,టీడీపీ ఫాలోవర్ వేణుమాధవ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ . ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, మిమిక్రి ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.
టీడీపీ ఆవిర్భావం ఆ పార్టీలో చేరిన వేణుమాధవ్ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్,చంద్రబాబులతో సన్నిహితంగా మెదిగిన వేణు గత ఎన్నికల్లో సైతం ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. అయితే టీడీపీ తరపున కాకుండా స్వతంత్ర్య అభ్యర్ధిగా వేణు మాధవ్ నామినేషన్ వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కోదాడ నుంచి రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు టీడీపీ ఇంఛార్జీ బొల్లం మల్లయ్య యాదవ్. టీడీపీ తరపున టికెట్ ఆశీంచిన ఆయనకు మొండిచేయి మిగలడంతో రెబల్‌గా బరిలోకి దిగననున్నట్లు సమాచారం. మరోవైపు ఇక్కడి నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.