శంక‌ర్ సినిమాలో వెన్నెల కిషోర్..

312
shankar vennela kishore
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ 2.ఓ. ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈమూవీ కి అన్ని ప్రాంతాల‌నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. మొద‌టి రోజే ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్ని తిర‌గ‌రాశారు. ప్రిమియ‌ర్ షో టాక్ చూస్తే బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

2.o

ఈసినిమా ప‌క్కాగా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌నే విజ‌యంతో ఉన్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. శంక‌ర్ త‌ర్వాతి మూవీ క‌మ‌ల్ హాస‌న్ తో భార‌తీయుడు2 చేయ‌నున్నాడు. ఈసినిమాకు సంబంధించిన సెట్స్ ను హైద‌రాబాద్ రామోజీఫీల్మ్ సిటీలో వేస్తున్నారు. ఈమూవీని ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జ‌రుప‌నున్న‌ట్లు తెలుస్తుంది.

shankar

ఇప్ప‌టికే క‌మ‌ల్ ను డిఫ‌రెంట్ లుక్ లో త‌యారు చేసిన ఆయ‌న కొన్ని ముఖ్య‌మైన పాత్ర‌ల్లో దుల్క‌ర్ స‌ల్మాన్, శింబుల‌ను తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇక సినిమాలో కామెడీని కూడా జోడి చేయనున్నట్లు తెలుస్తుంది. అందుకోసం తెలుగు క‌మెడీయ‌న్ వెన్నెల కిషోర్ ను తీసుకున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -