విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం `వెంకీమామ`. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా…విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ – “ఫైనల్లీ దేవుడా! సక్సెస్‌నిచ్చావు. ఎంటైర్ యూనిట్ ఈ సినిమా కోసం పడ్డ కష్టంతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అందుకున్నాం. మంచి సినిమాను తీయాలనే ఉద్దేశంతోనే `వెంకీమామ` సినిమాను చేశాం. ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, టెక్నీషియన్స్‌కు మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చిరంజీవి సినిమా చూశారు. ఆయనకు బాగా నచ్చింది. అలాగే మహేశ్ కూడా మా సినిమాను చూసి బావుందని అప్రిషియేట్ చేశారు. వారిద్దరికీ థ్యాంక్స్.
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ – “ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన రోజు మైండ్ బ్లాక్ అనిపించింది. ఏమవుతుందో, ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీస్ చేసుకుంటారో అని టెన్షన్‌గా ఉండింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాను తమదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. బావుందని అంటున్నారు. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మామలు కలిసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపించారు. మాకే కాదు.. ఇది తాతగారి డ్రీమ్, తాతగారి సక్సెస్. అందుకు చాలా హ్యాపీ. సాధారణంగా కొంత మంది దర్శకులు నా కెరీర్‌లోకి వచ్చి నాకొక కొత్త దారిని చూపించారు. అలాంటి దర్శకుడు బాబీ ఉన్నాడు. ఆయనకు థ్యాంక్స్. రామ్‌లక్ష్మణ్ మాస్టర్‌గారికి థ్యాంక్స్. ప్రసాద్ మూరెళ్ళగారికి ధన్యవాదాలు. సినిమాలోని స్పాన్‌ను అద్భుతంగా విజువలైజ్ చేశారు. నాకు రాశీఖన్నాకి, పాయల్‌కి, అలాగే వెంకీమామకి, పాయల్‌కి, రాశీఖన్నాకు ఉన్న ట్రాక్‌లను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదొక ఫ్రెష్ ఇన్నింగ్స్. ఎఫ్ 2తో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి చెప్పిన వెంకీమామ ఈ సినిమాతో హ్యాపీ క్రిస్మస్, హ్యపీ సంక్రాంతి చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు రెండేళ్లు కలిసి ట్రావెల్ చేశాం. కాబట్టి ఎంటైర్ టీమ్‌కు మరోసారి థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్“ అన్నారు.
రాశీఖన్నా మాట్లాడుతూ – “వెంకటేశ్‌గారు ఓ యాక్టరే కాదు..ఓ ఎమోషన్. నా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశాను. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మామ, అల్లుడు నిజంగానే చింపేశారు. వెంకటేశ్‌గారితో కలిసి ట్రావెల్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. వెంకటేశ్‌గారి డేడికేషన్‌కి హ్యాట్సాఫ్. సినిమాతో చాలా కనెక్ట్ అయ్యాను. అలాగే చైతన్య కూడా తన హార్డ్ వర్క్‌తో ప్రతి ఏడాది తన సినిమాలతో మనల్ని ఆశర్యపరుస్తున్నాడు. చైతుతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాను. పాయల్ కూడా అద్భుతంగా నటించింది. ఇప్పుడు డైరెక్టర్ బాబీ బ్లాక్‌బస్టర్ బాబీ అయ్యాడు. భయం లేని దర్శకుడు. ఎందుకంటే తారక్‌తో హిట్ తర్వాత మామ, అల్లుడితో ఈ సినిమా చేయడం చాలా గొప్ప విషయం“ అన్నారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ – “వెంకీమామ పెద్ద హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్. కచ్చితంగా మనం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ఇదొకటిగా నిలుస్తుందని చెప్పగలను. సినిమా చూస్తుంటే సెలబ్రేషన్స్‌లా అనిపించింది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్. చైతు టైమింగ్ సూపర్బ్. చాలా గొప్పగా భావిస్తున్నాను“ అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “రెండు వారాల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. హిట్ కొట్టారు. ఎంత టెన్షన్ ఉంటుందో ఓ డైరెక్టర్‌గా నాకు తెలుసు. కలియుగ పాండవులు సినిమాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో షూటింగ్ చేసినప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని కలిశాను. అలాగే బొబ్బిలిరాజాను ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదు. ఆ సినిమా 200 డేస్ ఫంక్షన్ కోసం నా మ్యాథ్స్ పరీక్ష బంక్ కొట్టి వచ్చి ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తీసిన వెంకీమామ సినిమా థ్యాంక్స్ మీట్ స్టేజ్‌పై నిలబడి ఉండటం గొప్పగా భావిస్తున్నాను. వెంకటేష్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. సినిమా ఇండస్ట్రీలోని జెన్యూన్ పర్సన్స్‌లో వెంకటేశ్‌గారు ఒకరు. ఆయనతో సినిమా చేయకపోయినా, ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన తీరు నేను మరచిపోలేను. అలాగే జోష్ టైమ్‌లో నేను చైతన్యతో కలిసి ట్రావెల్ చేశాను. తన దారిని తనే నిర్మించుకున్నాడు. నిన్న మజిలీ, ఈరోజు వెంకీమామ, రేపు శేఖర్ కమ్మల సినిమా రాబోతుంది. ఇద్దరూ యాక్ట్ చేయలేదు. వారిద్దరి బంధం సినిమాలో మనకు కనపడింది. చాలా మంది హీరోలకే వారి కుటుంబ సభ్యులతో కలిసి నటించే అవకాశం దక్కుతుంది. అలాంటి అదృష్టం చైతన్యగారికి దక్కింది. రేపు ఆయన పిల్లలు, మనవళ్లకు చూపించుకునేలా మనం, వెంకీమామ సినిమాలు చూపించుకునేలా ఉన్నాయి. తనకు అభినందనలు. రాశీఖన్నా హార్డ్‌వర్క్‌తో ఈస్థాయికి ఎదిగింది. అలాగే పాయల్‌కి అభినందనలు. తమన్ సక్సెస్‌ను ఓ బ్రదర్స్‌లా ఎంజాయ్ చేస్తున్నాను. వివేక్‌గారితో ఎప్పటి నుండో పరిచయం ఉంది. అలాగే విశ్వప్రసాద్‌గారికి, వివేక్‌గారికి అభినందనలు. సురేష్‌బాబుగారికి థ్యాంక్స్. డైరెక్టర్ బాబీ, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంటను అద్భుతంగామిక్స్ చేసి సినిమా చేశాడు. రైటర్ నుండి ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సినిమాను గెలిపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్“ అన్నారు.
డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ – “ఈ సక్సెస్ రెండేళ్ల కష్టమది. ఓ డైరెక్టర్ కలను 24 శాఖలు కలిపి చేస్తేనే సినిమా. అన్ని సినిమాలకు అందరూ కష్టపడతారు. కానీ సక్సెస్‌ను ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెషల్. ఈ సినిమా చేయడానికి ఎంత సంతోషపడ్డానో అంతే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే.. నిజమైన మామ, అల్లుడితో చేసే సినిమా. వెంకటేశ్‌గారు, చైతన్యగారి పాజిటివిటీ వల్లే ఈ సినిమా తీయగలిగాను. నేను చేసింది మూడు సినిమాలే. వెంకటేష్‌గారి ముందు నేనేమీ లేదు. ఓ హీరోగా వర్కింగ్ స్టైల్లో, ఎక్స్‌పీరియెన్స్‌లో గుర్తు పెట్టుకుంటే ఆయనే ముందుంటారు. చైతన్యలో నిజాయతీ లేకపోతే, ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు. తను కథను నమ్మాడు. మావయ్యలను నమ్మాడు. అదే ఈ రిజల్ట్. చిరంజీవిగారు ఓ ఆడియెన్‌లా ఎంజాయ్ చేశారు. సినిమాలోని సన్నివేశాల గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే మహేష్‌గారు కూడా సినిమాను చూసి ట్వీట్ చేశారు. వారికి థ్యాంక్స్. ప్రసాద్ మూరెళ్లగారికి రెండేళ్లు ముందు ఈ కథను చెప్పాను. ఆయన నేను ఊహించిన దానికంటే గొప్పగా చూపించారు. వివేక్‌గారు, సురేష్‌గారు ఇచ్చిన నమ్మకాన్ని మరచిపోలేను. తమన్‌తో పవర్ సినిమా చేశాను. ఇప్పుడు మరో సినిమా చేశాను. ఐదుసార్లు నా కోసం రీరికార్డింగ్ చేశాడు. విశ్వప్రసాద్‌గారికి థ్యాంక్స్. రాశీఖన్నా, పాయల్ కేవలం హీరోయిన్స్‌గానే కాదు.. సన్నివేశాలను అద్భుతంగా డ్రైవ్ చేశారు. ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించారు“ అన్నారు.
డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ – “సినిమా చేయడానికి ముందు వెంకటేశ్‌గారు, చైతన్యగారి కాంబినేషన్‌కి ఎగ్జయిట్ అయ్యాను. సినిమా చూస్తున్నప్పుడు కథకు ఎగ్జయిట్ అయ్యాను. డైరెక్టర్ బాబీ అన్న సినిమాను బాగా డ్రైవ్ చేశారు. వెంకటేశ్‌గారికి, చైతన్యగారు, పాయల్, రాశీఖన్నా సహా ఎంటైర్ యూనిట్‌కు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్“ అన్నారు.
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ – “నేను ఓ బేబీ సినిమా చూస్తున్నప్పుడు వెంకీమామ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు బాబీ డైరెక్టర్‌గా సిక్స్ కొట్టాడు. వెంకటేశ్‌గారు, చైతన్య కాంబినేషన్‌ను పోస్టర్‌పై చూడగానే చాలా సంతోషమేసింది. నిజంగానే పండను ముందుగానే తీసుకొచ్చారు. కామెడీ రాసుకున్నా, ఎమోషన్ రాసుకున్నా ఎలా రాసుకున్నా.. ఆయన దాన్ని హండ్రెడ్ పర్సంట్‌కి తీసుకెళతారు. ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుంది. వెంకీమామను చూస్తుంటే అలా అనిపించింది. చైతన్య ఔట్ స్టాండింగ్‌గా నటించాడు. వెంకటేశ్‌గారు, చైతు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. బాబీ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. రాశీ, పాయల్ చక్కగా నటించారు. ఎంటైర్ టీమ్ అద్భుతంగా వర్క్ చేసింది“ అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “రెండు వారాల్లో అందరి సపోర్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. అలాగే సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. వెంకటేష్‌గారు, చైతు, సురేష్ ప్రొడక్షన్స్‌లకు థ్యాంక్స్. డైరెక్టర్ బాబీ, రాశీ, పాయల్, తమన్, వివేక్ సహా మాకు అండగా నిలిచిన అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ – “నాకు బాబీ మామూలు సినిమా ఇవ్వలేదు. స్క్రిప్ట్ రాసుకోవడం కాదు.. సినిమా చేయడం చాలా కష్టం. అలాంటి సినిమాను చేసిన బాబీ.. నాపై నమ్మకంతో నాకు ఈ సినిమానిచ్చాడు. అద్భుతమైన సినిమాను ఇచ్చాడు. ప్రసాద్ మూరెళ్లగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్‌గారు యాక్షన్, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ అన్ని అద్భుతంగా కుదిరాయి. వెంకటేశ్‌గారి పుట్టినరోజున సినిమా రావడంతో మాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. దీంతో మరింత కేర్ తీసుకుని ఈ సినిమా చేశాం. రీరికార్డింగ్ కోసం చాలా కష్టపడ్డాం. పవర్ తర్వాత మరో హిట్ ఇచ్చి డబుల్ పవర్ ఇచ్చాడు. వెంకటేశ్‌గారు, చైతన్యగారితో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి సినిమా చేశాను. వెంకటేశ్, చైతన్యగారికి థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్“ అన్నారు.