“వెంకీమామ” ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

537
venky mama
- Advertisement -

విక్టరీ వెంకటేశ్ అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం వెంకీమామ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజూ నుంచి ఈమూవీకి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. వెంకటేశ్ నాగ చైతన్య కెరీర్ లో మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకూ ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 25కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 27.64 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈసినిమా రూ.10కోట్లను వసూలు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.. నిజమైన మేనమామలు తొలిసారిగా ఆన్ స్క్రీన్ పై కలిసి నటించడం ఈసినిమాకు ప్లస్ గా మారింది. విడుదలై 15రోజులు దాటుతున్న ఇంకా ఈసినిమా విజయవంతంగా నడుస్తుంది. చాలా రోజుల తర్వాత భారీ బడ్జెట్ సినిమాను నిర్మించిన నిర్మాత సురేష్ బాబుకు మంచి లాభాలను తెచ్చి పెట్టిందనే చెప్పుకోవాలి.

- Advertisement -