- Advertisement -
టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్,మల్టీస్టారర్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఓ వైపు నాని-నాగార్జున మల్టీస్టారర్ మూవీ పట్టాలపై ఉండగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ తెరకెక్కనుండగా మరో సినిమాకు రంగం సిద్ధమైంది.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఎఫ్2 ( ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జూన్ 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వెంకీ సరసన తమన్నా నటించనుండగా, మెహరీన్ పీర్జా మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కథానాయికగా నటిస్తుంది.
ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
- Advertisement -