జాలీ ఎల్‌ఎల్‌బీగా వెంకీ..!

216
- Advertisement -

అక్షయ్ కుమార్ లాయర్ గా కోర్ట్ డ్రామా తో ఏడాది క్రితం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లు పొందిన హిందీ సినిమా ”జాలీ ఎల్ ఎల్ బి 2”. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల గురు సినిమాను రీమేక్‌ చేసి హిట్ కొట్టిన వెంకటేష్.. మరోసారి రీమేక్ బాటనే ఎంచుకున్నాడు. గతంలో హిందిలో అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ ను తెలుగులో ‘గోపాల గోపాల’గా రీమేక్ చేసి హిట్ కోట్టిన వెంకీ.. మరోసారి అక్షయ్ కుమార్ హీరోగా నటించిన జాలీ ఎల్ ఎల్ బి 2 ను తెలుగులోకి తెస్తాడట. అంతేకాదు ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తాడని సమాచారం.

Venkatesh-and-Trivikram

తెలుగులో మంచి కథ బలం తెలిసిన నిర్మాత రాధాకృష్ణ జాలీ ఎల్‌ ఎల్‌ బీ కాపీరైట్ తీసుకొని తన సొంత బేనర్ అయన హారిక హాసిని క్రియేషన్స్ పై నిర్మిస్తారు అని తెలుస్తుంది. కాగా, ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాలు సగం రీమేక్ సినిమాలే. ఖైదీ150… ధృవ.. ప్రేమమ్.. గురు.. ఇలా చాలావరకు రీమేక్ సినిమాలే.

- Advertisement -