ఎఫ్ 2 సినిమాతో హిట్ కొట్టాడు విక్టరీ వెంకటేష్. సంక్రాంతి రేసులో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. వెంకటేష్,వరుణ్ తేజ్ తమ నటనతో ఫిదాచేశారు. ఈ సినిమా హిట్‌తో మంచి జోష్ మీదున్న వెంకీ తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా మల్టీస్టారర్ మూవీనే చేయనున్నాడు.
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యల కాంబోలో బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న వెంకీమామ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 21 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెంకీమామలో, చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ సరసన శ్రియ నటించనుంది. మొదటి షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో 17వ చిత్రంగా ‘మజిలి’
చేస్తున్నాడు. పెళ్లి తర్వాత తొలిసారిగా చైతూ-సమంత కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.