నిర్ణయం మార్చుకున్న ‘వెంకీమామ’..!

488

వెంకటేష్‌, చైతూ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో మేనమామ మేనల్లుడు పాత్రల్లో వెంకీ,చైతూ కనిపించనున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా .. పాయల్ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

venky mama

 

విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన, డిసెంబర్ ఫస్టు వీక్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

ఇక హీరో వెంకటేష్‌ మల్టీస్టారర్‌ మూవీ అనగానే ముందుంటాడు. ఇదివరకు వచ్చిన సితమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,గోపాల గోపాల,ఎఫ్‌2 మంచి విజయాన్ని అందుకున్నాయి. అదే రేంజ్‌లో ఇప్పుడు వెంకీ మామ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌంతుంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్‌ హిట్‌ను అందుకుంటుందో చూడాలి.