వెంకీ మామ…ఫస్ట్ డే కలెక్షన్స్‌..!

340
venky mama

మామ అల్లుళ్లు వెంకటేష్ – నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెంకీమామ. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

చైతూ- వెంకీ నటనకు తోడు కామెడీ,సెంటిమెంట్ బాగా వర్కవుట్ కావడంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తమ కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లను రాబట్టారు మామ అల్లుళ్లు.

తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల గ్రాస్‌ సాధించగా వరల్డ్‌ వైడ్‌ గ్రాస్‌ 8 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్‌లో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వెంకీకి జోడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నాలు నటించారు. బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌కు తమన్‌ సంగీతమందించాడు.

Venky Mama is a 2019 Indian Telugu-language action comedy film produced by D. Suresh Babu under Suresh Productions banner and directed by K. S. Ravindra.