స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు హీరో వెంకటేశ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ప్రకటిస్తూ ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రాధాకృష్ణ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుందని సమాచారం.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి సినిమాలకి డైలాగ్స్‌తో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు త్రివిక్రమ్. అలాగే కరణాకరణ్ డైరెక్షన్ లో వచ్చిన వెంకటేశ్ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే. 2026 లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Also Read:కేసీఆర్ ప్రజాయోధుడు..పుస్తకావిష్కరణ
𝗧𝘄𝗼 𝗼𝗳 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗖𝗶𝗻𝗲𝗺𝗮’𝘀 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 𝗻𝗮𝗺𝗲𝘀 @VenkyMama & #Trivikram unite for a tale to cherish for all time ❤️#Venky77 ~ @haarikahassine Production No. 8 – #VenkateshXTrivikram was launched today with blessings and love from near and dear ones 🪔… pic.twitter.com/NvxQ3pnMPC
— Haarika & Hassine Creations (@haarikahassine) August 15, 2025

