వెంకీ ‘ సైంధవ్’

38
- Advertisement -

హీరో వెంకటేష్ 75వ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలను తెలియపరుస్తూ మేకర్స్ తాజాగా ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘సైంధవ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా సైంధవ్ రిలీజ్ కానుంది.

సైంధవ్ కథ చంద్రప్రస్థ అనే కల్పిత ఓడరేవు ప్రాంతంలో సెట్ చేయబడిందని సూపర్ కూల్ గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. వెంకీ గడ్డంతో చేతిలో తుపాకీ పట్టుకొని ఊబర్ కూల్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వీడియో చివర్లో పేలుడు , వెంకీ పవర్ ఫుల్ డైలాగ్‌లు సైంధవ్ యాక్షన్‌లో ఎక్కువ మోతాదులో ఉండబోతున్నాయని, వెంకీ పవర్ ఫుల్ కేరెక్టర్ పోషిస్తున్నాడని తెలియజేస్తున్నాయి.

సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. HIT దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -