వెంకీ బర్త్ డే…ఎఫ్‌ 3 పోస్టర్ రిలీజ్!

204
f3
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌- వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ 2. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోగా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎఫ్3 స్ర్కిప్ట్‌ను అనిల్ రావిపూడి సిద్దం చేయగా ఈ మూవీని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు.

ఇంకా ఇవాళ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగి ఎఫ్3 పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది 2021లో ప్రారంభం కానుంది. ఇందులో వెంకీమామ, వరుణ్ తేజ్‌లు డబ్బుల కట్టలు పోగేసుకొని పరుగుతు తీస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఏరేంజ్‌లో ఫన్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తారనేది వేచి చూడాలి.

- Advertisement -