వెంకి కూతురు పెళ్లి..సర్వం సిద్ధం..!

308
venkatesh daughter marriage
- Advertisement -

ఎఫ్‌ 2 సినిమాతో ప్రేక్షకుల్లో ఫుల్ ఫన్ నింపిన హీరో వెంకటేష్‌. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి వెంకీమామ చిత్రాన్ని చేస్తూన్న ఆయన రియల్‌ లైఫ్‌లో కూడా వెంకీమామగా మారబోతున్నారు. వెంకీ పెద్ద కూతురు అశ్రిత త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడే వినాయక్ రెడ్డితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో ఈ పెళ్లి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు టాక్‌.

ఫిబ్ర‌వ‌రిలో ఆశ్రిత ఎంగేజ్‌మెంట్ మ‌ణికొండ‌లో జరిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా రాజస్థాన్ వేదికగా వీరి వివాహం జరగనుందని టాక్‌. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం స‌న్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు.

మరో వారంలో దగ్గుబాటి వారి ఇంటి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులకు శుభలేఖల్ని అందించారట. పెళ్లిని బంధువులు స్నేహితులు సమక్షంలో జరిపించి హైదరాబాద్‌లో వైభవంగా రిసెప్షన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట వెంకీమామ.

- Advertisement -