ఎఫ్‌2 కోసం వెంకీ, వరుణ్‌..

204
- Advertisement -

యూత్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్న వెంకటేష్ రంగంలోకి దూకేసాడు. గురు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీ ఆ మధ్య తేజ దర్శకత్వంలో రూపొందే ఆటా నాదే వేటా నాదేలో బిజీ అయినట్టు వార్తలతో పాటు గెటప్ కు సంబంధించి స్టిల్స్ కూడా బయటికి వచ్చాయి.

కాని దాని అప్ డేట్స్ మాత్రం సడన్ గా ఆగిపోయాయి. ఫిదా-తొలిప్రేమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ చేయబోతున్న ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (ఎఫ్2)షూటింగ్ కాదు కాని స్క్రిప్ట్ ఫైనల్ చేయటం కోసం నిర్మాత దిల్ రాజు-దర్శకుడు అనిల్ రావిపూడిలతో కలిసి వెంకీ అండ్ వరుణ్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Venkatesh And Varun Tej Meet Up For F2

వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌). అయితే ఎవరు ఫన్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్‌ క్యారెక్టర్‌లో నటించనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌ లోగోను అధికారికంగా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతోంది.

ఈ దర్శకుడు మూడు సినిమాలు పటాస్-సుప్రీమ్-రాజ ది గ్రేట్ ఒకదాన్ని మించి ఒకటి కమర్షియల్ హిట్స్ గా నిలవడంతో ఇప్పుడు డీల్ చేయబోయే మల్టీ స్టారర్ అంతకు రెట్టింపు వినోదంతో ఉండబోతోంది అని ఇన్ సైడ్ టాక్. హీరొయిన్స్-టెక్నికల్ టీంకి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వినోదంతో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో మిక్స్ చేసినట్టు టాక్.

- Advertisement -