మల్టీస్టారర్ మూవీలో మామతో చైతు…

230
Venkatesh And Naga Chaitanya Multistarrer Movie
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ అంటే గతంలో అదో ఊహ మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు.. స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకూ ప్రతీ ఒక్కరూ మల్టీ స్టారర్ కాన్సెప్టులపై ఆసక్తి చూపుతున్నారు. సీతమ్మ వాకిట్లో చిత్రంలో మహేష్ తో కలిసి ఈ ట్రెండ్ ను ఆరంభించిన వెంకటేష్.. గతంలో నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీలో ఓ కేమియో కూడా చేసి అలరించాడు.

Venkatesh And Naga Chaitanya Multistarrer Movie

‘సోగ్గాడే చిన్ని నాయనా’తో నాగార్జునకు, ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో నాగ చైతన్యకు దర్శకుడు కల్యాణ్ కృష్ణ హిట్స్ ఇచ్చాడు. తాజాగా ఆయన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసుకుని వెళ్లి వెంకటేశ్ కి వినిపించాడు. ఆ కథ ఆయనకి బాగా నచ్చేసిందని సమాచారం. ఈ కథలో యంగ్ హీరో చేయాల్సిన పాత్ర ఒకటి ఉండటంతో, ఎవరితో చేయించాలా? అనే ఆలోచనలో దర్శకుడు వున్నాడట.

అయితే ఆ పాత్రకి చైతూ బాగుంటాడని వెంకటేశ్ చెప్పాడట అంతేకాదు చైతూకి ఫోన్ చేసి ఒప్పించాడట. తనకి హిట్ ఇచ్చిన దర్శకుడి సినిమా కావడం .. తనని అడిగింది మేనమామే కావడం వలన చైతూ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఓ రకంగా ఇది మల్టీ స్టారర్ అనే అనుకోవాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.

- Advertisement -