వెంకటాపురంతో నిర్మాతగా మారాను‌..

236
Venkatapuram Producer Birth Day Celebrations
- Advertisement -

హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించిన సినిమా వెంకటాపురం. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా సస్పెన్స్ థ్రిల్లర్ ని తెరకెక్కించారు…స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12 శుక్రవారం విడుద‌లై మంచి టాక్ తో స‌క్సెస్‌ ఫుల్‌ గా దూసుకుపోతున్న వెంక‌టాపురం నిర్మాతల్లో ఒక‌రైన తూము ఫ‌ణికుమార్ పుట్టిన రోజు వేడుక‌లు శ్రేయాస్ మీడియా కార్యాల‌యంలో జ‌రిగాయి. ఎగ్జిబిట‌ర్ గా మంచి స్థాయిలో ఉండి సినిమా నిర్మాణం మీద మ‌క్కువ‌తో వెంక‌టాపురం లాంటి కొత్త జోన‌ర్ మూవీతో నిర్మాత‌గా మారారు తూము ఫ‌ణికుమార్ . తొలి సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న స‌మ‌యంలోనే త‌న పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌డం మ‌రింత ఆనందాన్ని క‌లిగించింద‌న్నారు ఫ‌ణికుమార్. ఈ వేడుక‌లో వెంక‌టాపురం హీరో రాహూల్ తో పాటు నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ పాల్గోన్నారు.

Venkatapuram Producer Birth Day Celebrations

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు, వి.వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించిన చిత్రం మా వెంక‌టాపురం. వైజాగ్ నేప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

Venkatapuram Producer Birth Day Celebrations

హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. చాలా అందంగా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఓదిగిపోయాడు రాహుల్, చిత్రం చూసిన త‌రువాత రాహుల్ కంటే ఆనంద్ గా అంద‌రి మ‌న‌స్సులు గెలుచుకుంటాడు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ సినిమా విడుద‌లై మంచి టాక్ తో స‌క్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది.

- Advertisement -