గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ సఫ్ట్ వేర్ ఇంజనీరు గుడి వెంకట కృష్ణారెడ్డి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో తన ఇంటి ఆవరణలో 20 రకాల పూల మొక్కలు నాటారు. అనంతరం ఆయన మిత్రులు సాయి రెడ్డి, ఎండీ అస్లం, ముదం శ్రీను, మరియు కమల్ గౌడ్‌కు ఈ ఛాలెంజ్ విసరడం జరిగింది. తమ వంతుగా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సందర్భంగా గుడి వెంకట కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మాలాంటి ఎందరో సామాజిక సేవకులకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వాతావరణ కాలుష్యం నియంత్రించడం కోసం సంతోష్ కుమార్ చేపట్టిన ఈ చాలెంజ్‌ను స్పూర్తిగా తీసుకొని ఎంతోమంది మొక్కలు నాటడం జరుగుతుందని. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.