ANR Statue:ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

57
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేక స్ధానం. చినిపోయే చివరి క్షణాల వరకు సినిమానే జీవితంగా బ్రతికారు. అక్కినేని బయోపిక్‌లో ఫ్యామిలీ అంతా కలిసి నటించి మెప్పించారు. ఇవాళ ఆయన శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీనిని ఆవిష్కరించారు.

గ్రాండ్‌గా జరిగిన ఈవిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ తెలుగు సినిమా పరిశ్రమ కోసం చేసిన సేవలను, ఉమ్మడి ఆంధ్ర రాష్టానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. మహేశ్ బాబు, రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని, మంచు విష్ణు, శ్రీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల మాదిరిగా ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో కార్యక్రమాన్ని జరిపేలా ప్లాన్ చేశారు. దీంతో ఈ ఏడాది అంతా ఏఎన్నార్ సంవత్సరంగా మారబోతుంది.

Also Read:మోడీ క్లారిటీ ఇచ్చారా ? కన్ఫ్యూజన్ లోకి నెట్టారా ?

- Advertisement -