జయ ఆరోగ్యంపై వదంతులు సరికాదు..

257
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వందతులు సరికాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను వెంకయ్యనాయుడుయ ఆదివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద నేతలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు, వత్రాలూ, దీక్షలూ చేస్తున్నారు.

jaya

అమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏకంగా 10వేల మందికిపైగా అభిమానులు మురుగన్‌కు పాలాభిషేకం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో తలపై పాలబిందెలను మోసుకొస్తూ.. పాదయాత్రగా 10వేలమంది ఒకేసారి తిరుపరాంకుండ్రమ్‌ మురుగన్‌ ఆలయాన్ని సందర్శించారు. అమ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని కోరుతూ మురుగన్‌కు ఏకంగా 10వేలమంది భక్తులు పాలాభిషేకం చేశారు. గుండెలపై అమ్మ ఫొటోను పెట్టుకొని భక్తులు ఈ మహా ఉత్సవంలో పాల్గొన్నారు. ఒకేసారి వేలమంది పాలబిందెలతో ఇక్కడికి రావడంతో మురుగన్‌ ఆలయం వద్ద జాతర వాతావరణం నెలకొంది.

tamilnadu

గత 15రోజులకుపైగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆమె కోలుకోవడానికి వైద్యబృందం ప్రత్యేక చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

jayalalitha

- Advertisement -