భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం వీఐపీ నైవేథ్య విరామ సమయంలో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారే స్వామి వారిని దర్శించుకుంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించిన వారు అవుతారని తెలిపారు. తాను కూడా అదే విధంగా ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటానని చెప్పారు. ఆకలి అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలన్నారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు.
ప్రపంచ మానవాళి సుఖఃసంతోషాలతో జీవించాలని, ఘర్షణలు, అత్యాచారాలు,అవినీతి, అసమానతలు లేని మార్గాన్ని చూపించాల్సిందిగా స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. రాజకీయాల్లో లేను, భవిష్యత్ లో రాజకీయాల్లోకి రానని చెప్పారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో %B