విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్ లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టిఫిన్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ తిన్నారు. ఈ ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు.
నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది అని ఈ సందర్భంగా తెలిపారు వెంకయ్య.గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలన్నారు.
Also Read:ఇకపై అడగ్గానే విడాకులు
ఈ సందర్భంగా హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని గుర్తుచేశారు. నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు.
Also Read:దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..
నలభై యేళ్లుగా ఇక్కడ ఇడ్లీ సెంటర్‌ను నడుపుతున్నామని తెలిపారు యజమాని కృష్ణప్రసాద్. మా నాన్న. మల్లికార్జున రావు ఈ హోటల్‌ను స్థాపించారు. పాక ఇడ్లీగా ప్రసిద్ధి చెందడంతో ప్రముఖులు కూడా వస్తుంటారని చెప్పారు.