- Advertisement -
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలను ఇవాళ,రేపు తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
మే 11వ తేది ఉదయం 9 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.
మే 11వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో శ్రీ తరిగొండ వెంగమాంబకు పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.
Also Read:భారత ఆర్మీకి అండగా ఉందాం
- Advertisement -

