- Advertisement -
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్ , ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంను కలిసినవారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ , స్థపతి వల్లినాయగం , ఈఈ రాజేష్ , డీఈఈ రఘునందన్ , ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ , ఇతర ముఖ్యులు ఉన్నారు.
Also Read:ఎన్నికల కోసమే హైడ్రా..డీకే అరుణ ఫైర్
- Advertisement -