Vemulawada:గోశాలలో ఆగని మరణాలు

5
- Advertisement -

వేములవాడ రాజన్న గోశాలలో కోడెల మరణాలు ఆగలేదు. బుధవారం ఒక కోడె మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన కోడెల సంఖ్య 28కి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి కోడెలు నిలువ చేస్తున్నారు అధికారులు.

భక్తులు సమర్పించిన కోడెలు తిప్పాపురం గోశాలకు తరలించి రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా, 6 నెలలుగా కోడెల పంపిణీ చేయలేదు దేవాదాయ శాఖ అధికారులు.

తిప్పాపురం గోశాలలో కేవలం 500-600 కోడెలకు మాత్రమే స్థలం ఉండగా, గత కొన్ని నెలలుగా కోడెల పంపిణీ నిలిపివేయడంతో దాదాపు 1200 కోడెలు నిలువ ఉంచారు అధికారులు. దీంతో సరైన నిర్వహణ లేక అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి కోడెలు.

Also Read:తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ

- Advertisement -