రాష్ట్ర రవాణా శాఖ, ఆర్ అండ్ బీ, గృహనిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు దైవ సమానులు అని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు కేసీఆర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.
సీఎం కేసీఆర్ వెన్నంటే ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తాను అని స్పష్టం చేశారు. తనకు అప్పగించిన శాఖల్లో మంచి కార్యాచరణ అమలు చేస్తానని, అధికారులతో కలిసి అందరికీ న్యాయం జరిగేలా పని చేస్తానని మంత్రి వేముల పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డికి ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
(ప్రమాణ స్వీకారానికి హరీష్‌రావు ఎలా వచ్చాడో చూడండి..https://goo.gl/AyWJva)