బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్న ప్రభుత్వం: ప్రశాంత్ రెడ్డి

7
- Advertisement -

శాసన సభలో కాంగ్రెస్ వ్యవహార తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నారు. హామీలపై అసెంబ్లీలో అడిగితే మంత్రులు అడ్డుకున్నారు అన్నారు.

సభలో ఉన్న సభ్యులందరికి సమాన హక్కులుండాలని జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేము ప్రశ్నించకుండా ప్రభుత్వం గొంతు నొక్కుతోంది.. నాలుగు గంటలుగా అసెంబ్లీని వాయిదా వేసుకున్నారు అన్నారు.

మమ్మల్ని మాట్లాడకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ దుష్టపన్నాగం చేస్తోందని.. మీరు ఏమీ అనకున్నా స్పీకర్‌ దగ్గర విచారం వ్యక్తం చేయాలని కేసీఆర్ సూచించారు అన్నారు. సభ నడిచే విధంగా చొరవ తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.. గతంలో ఎవరూ ఏమీ అనకున్నా డీకే అరుణ సభలో బాధపడ్డారు, తప్పు లేకున్నా కేటీఆర్‌తో కేసీఆర్ క్షమాపణ చెప్పించారు అన్నారు.

జగదీశ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పుంటే స్క్రీన్ చేసి చూపించండి.. జగదీశ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించండి అన్నారు. తప్పుంటే విచారం వ్యక్తం చేయడానికి జగదీశ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.. ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు జగదీశ్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలి అన్నారు.

Also Read:కేటీఆర్‌తో డీఎంకే నేతల భేటీ

- Advertisement -