ఏడాది కల్లా చెక్‌డ్యాంల నిర్మాణంపూర్తి:ప్రశాంత్ రెడ్డి

221
prashanth reddy
- Advertisement -

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కప్పల వాగు, పెద్ద వాగుపై చెక్ డ్యాం ల నిర్మాణం జరుగుతొందని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.సీఎం కేసీఆర్ దయ వల్ల 9 చెక్ డ్యాంలను పూర్తి చేశా అన్నారు.

తాజాగా 3 చెక్ డ్యాం లకు శంకుస్థాపన చేశాం అని తెలిపిన ప్రశాంత్ రెడ్డి…కరోనా వల్ల 3 నెలలు ఆలస్యం అయిందన్నారు.45 కిలో మీటర్ల మేర 23 చెక్ డ్యాంలను నిర్మించాలని నిర్ణయించాం అన్నారు.

ఈ చెక్ డ్యాంల వల్ల 40 వేల ఎకరాలకు సాగు నిరందుతుందని తెలిపిన ప్రశాంత్ రెడ్డి….వచ్చే ఏడాది కల్లా చెక్ డ్యాం ల నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.

బాల్కొండ నియోజకవర్గం కప్పలవాగు పై 14 కోట్ల 89 లక్షలతో నూతనంగా నిర్మించే 3(మూడు) చెక్ డ్యాంల నిర్మాణం

1.అక్లూర్ – బడా భీంగల్/భీంగల్ చెక్ డ్యాం(4.67 కోట్లు )

2.అక్లూర్ – మోతే చెక్ డ్యాం (5.08 కోట్లు )

3.మోతే చెక్ డ్యాం (5.14 కోట్లు )

- Advertisement -