15న వెయ్ దరువెయ్

20
- Advertisement -

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు…

ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ నవీన్ రెడ్డిగారు ఈ సినిమా కోసం ముందుగానే పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. అందుకనే నాకు ఎక్కువ పని పడలేదు. ఎక్కడా లెంగ్త్ ఎక్కువ కాకుండా, రీషూట్స్ వంటివి చేయకుండా అన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకున్నారు. అదే ఈ సినిమాకు సక్సెస్. మంచి కథ కుదిరింది. సాయిరామ్ శంకర్ నాకు మంచి స్నేహితుడు. తను మంచి టాలెంటెడ్. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు.ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ దేవరాజ్‌గారికి, దర్శకుడు నవీన్ గారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ ఫ్రెండ్‌గా నటించాను. భీమ్స్ సిసిరోలియో సంగీతం సూపర్బ్ గా ఉంది. నిర్మాత, దర్శకులకు మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు.

రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘పూరి ఎంత ఎనర్జిటిక్ గా ఉంటారో అంతే ఎనర్జిటిక్ గా సాయిరామ్ ఉంటాడంటూ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారు సాయిరామ్ శంకర్ గురించి చెప్పారు. ఓ సందర్భంలో తనతో సిినిమా చేయాలనుందంటూ కూడా పూరిగారికి చెప్పాను. సాయిరామ్ కి కమిట్ మెంట్, డిసిప్లెయిన్ ఉన్న యాక్టర్. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నవీన్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే తను మంచి టాలెంటెడ్ అని బెక్కెంగారు చెప్పారు. అలాగే భీమ్స్ గారు ఆయుధం సినిమా సమయం నుంచి నాకు పరిచయం. ఎన్.శంకర్ గారు పరిచయం చేశారు. అదే ఏడాది నేను వర్క్ చేసిన సత్యం సినిమా రిలీజైంది. ఆ సినిమా సమయంలో సత్యం రాజేష్, భాస్కరభట్ల రవికుమార్ పరిచయం అయ్యారు. నన్ను, సత్యం రాజేష్ ను సూర్య కిరణ్ గారు పరిచయం చేశారు. అలా మా జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. వెయ్ దరువెయ్ సినిమా విషయానికి వస్తే.. సినిమా పెద్ద సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్ కథ చెప్పగానే నచ్చింది. నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. నా బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతూనే మంచి పాయింట్ తో కథ రాసుకున్నారనిపించింది. అందుకనే చేయటానికి ఓకే చెప్పేశాను. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన దేవరాజ్‌గారికి థాంక్స్. భీమ్స్ గారు మంచి సాంగ్స్ తో పాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఉద్ధవ్ లతో మంచి అనుబంధం ఉంది. నాకోసం ఎంటైర్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. చాలా మంచి టీమ్ వర్క్ చేసింది. కామెడీతో పాటు మంచి ఎమోషన్, ఆలోచనతో తెరకెక్కిన సినిమా ఇది. మార్చి 15న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

ముఖ్య అతిథి పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సాయిరామ్ శంకర్‌గారు ఫికర్ మత్ కరో అనే డైలాగ్ చెబుతుంటారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గారు తగ్గేదే లే అని ఎలా అందరితో అనిపించారో.. ఈ వెయ్ దరువెయ్ సినిమాలో సాయిరామ్ అందరినోట ఫికర్ మత్ కరోఅనిపిస్తారని, సినిమా పెద్ద హిట్ అయ్యి, సాయిరామ్‌కి పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు నవీన్ చాలా మంచి టైటిల్ పెట్టారు. సినిమాకు దర్శకుడు తండ్రిలాంటి వ్యక్తి. నవీన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాను 35 రోజుల్లో పూర్తి చేయటం గొప్ప విషయం. నిర్మాత దేవరాజ్ బాగుండాలనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేసి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసిన నవీన్ గారికి థాంక్స్. నిర్మాత దేవరాజ్ పోతూరుగారికి ఆల్ ది బెస్ట్. కె.జి.యఫ్ తో యష్ ఎంత పెద్ద స్టార్ అయ్యారో, ఈ సినిమాతో హీరోయిన్ యష పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు భీమ్స్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తను ప్రతీ సినిమాకు దుమ్ము రేపుతున్నాడు. తనకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, మంచి వ్యక్తి పూరి జగన్నాథ్ అనే పేరుంది. కొత్త హీరోని పూరి చేతిలో పెడితే చాలు అనే పేరు తెచ్చుకున్నారు. ఆయన తమ్ముడైన సాయిరామ్ శంకర్ నటించిన వెయ్ దరువెయ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేటి రాజకీయ నాయకులు డబ్బులు పంచి ఓట్లు కొంటున్నారు. అలాంటి వారిపై వెయ్ దరువెయ్ అంటూ ఈ సినిమా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిపై వెయ్ దరువెయ్ అని దర్శకుడు అన్నారు. సమాజంలో చైతన్యం నింపేలా మంచి మెసేజ్‌తో సినిమా చేసిన టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.

Also Read:TTD: మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ

- Advertisement -