వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ విధానం అమలు..

5
- Advertisement -

వెహికల్ స్క్రాపింగ్ పాలసీ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన రవాణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…రాష్ట్రంలో, దేశంలో 15 సంవత్సరాలు వాడే వాహనాలు, 8 సంవత్సరాలు వాడే ప్రైవేట్ వాహనాలకు స్క్రాపింగ్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నాం అని…రాష్ట్రంలో మొత్తం 32 సెంటర్లు.. ఒక్కో సెంటర్ కి 8 కోట్లు ఖర్చు చేశామన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు అని..ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

Also Read:‘దేవర 2’ ..ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

- Advertisement -