నరేశ్‌.. వీరాంజనేయులు విహారయాత్ర

8
- Advertisement -

నవరసరాయ డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీం కాబోతోంది. ఇటివలే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరోలు వెంకటేష్, శ్రీవిష్ణు, సందీప్ కిషన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ట్రైలర్ ని లాంచ్ చేశారు.

‘ప్రియాతిప్రియమైన కుటుంబ సభ్యులకు మీ వీరాంజనేయులు ప్రేమతో రాయునది. ఆఖరి కోరికగా కుటుంబం అంతా గోవాలో నా ఆస్తికలు కలుపుతారని నమ్ముతున్నాను’ అంటూ వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఫ్యామిలీ ఎలిమెంట్స్, కథలోని ఎమోషన్స్ చాలా అద్భుతంగా వున్నాయి. ఫ్యామిలీ కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ అనురాగ్ ఈ చిత్రాన్ని మలిచారని ట్రైలర్ చుస్తే అర్ధమౌతోంది.

డా. నరేశ్‌ నేచురల్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్‌ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి. మ్యూజిక్, విజువల్స్ టాప్ క్లాస్ గా వున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ ఫన్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ బ్లెండ్ చేసిన ఈమూవీ ఆడియన్స్ కి ఒక ఫీల్ గుడ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.

Also Read:రేవంత్‌కు పాలనపై పట్టులేదు: రాకేష్ రెడ్డి

- Advertisement -