TTD: 9 నుండి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

6
- Advertisement -

నారాయణవనం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 9 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.ఆగస్టు 9వ తేదీ ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 10వ తేదీ రాత్రి సింహవాహనం, ఆగస్టు 11న రాత్రి భూత వాహనం, ఆగస్టు 12న రాత్రి శేష వాహనం, ఆగస్టు 13న రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు. అదేవిధంగా ఆగస్టు 14న రాత్రి గజవాహనం, ఆగస్టు 15న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, అనంతరం రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, లడ్డూ, అప్పం ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

ఆగస్టు 16న సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌సంతోత్స‌వం, రాత్రి 7 గంట‌ల‌కు అశ్వవాహనం, ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Also Read:KCR:జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన

- Advertisement -