- Advertisement -
మలయాళ బ్లాక్‌బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. `వాసుకి` ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, వరుణ్‌తేజ్ సహా చిత్రయూనిట్ పాల్గొంది.
- Advertisement -