వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి..

50
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 నుండి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం మహిళలతో పాటు వికలాంగులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ నేత డా.కెతిరెడ్డి వాసుదేవ రెడ్డి  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సమాజంలో మిగతా వర్గాల కంటే ఎక్కువగా వికలాంగులు వెనుకబడి ఉన్నారని వీరిని ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విదంగా రూ.4016/- పెన్షన్ తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేసిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6 లక్షల మంది వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వీరికి ఇప్పటికే 50% రాయితీతో బస్ పాస్ సౌకర్యం ఉందని, వీరికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినట్లయితే వికలాంగులు మరింత ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మహిళలతోపాటు వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో కూడా పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు.

దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద భారం కూడా పడదని కావున రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read:ఉచిత ప్రయాణం..ఉత్తర్వులు జారీ

- Advertisement -