బర్త్ డే…మొక్కలు నాటిన వాసుదేవారెడ్డి

37
vasudeva reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవ రెడ్డి పుట్టిన రోజు  సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు మలక్ పేట వికలాంగుల సంక్షేమ భవన్ లో దివ్యంగులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ..పుట్టిన రోజు సందర్భంగా  మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తుందని,  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించలని, గ్రీన్ ఇండియా చాలెంజి ఒక ఉద్యమంలా నడుస్తుందని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు నాయకత్వంలో ఆకుపచ్చ తెలంగాణ గా మారిందని, ఇందులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాత్ర గొప్పందని, రాష్ట్రం, దేశమే కాకుండా విదేశాల్లో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి తీసుకొని లక్షల మంది మొక్కలు నాటుతున్నరు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృత్ఞతలు తెలిపారు.

- Advertisement -