- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన కుమారుడు జన్మదినం సందర్బంగా మొక్కలు నాటారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు.
సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో తమ కుమారుడికి ఆయన పేరు పెట్టుకున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు, భావితరాల కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటామని, కార్యక్రమం గొప్పతనాన్ని తన కుమారుడికి తెలియజేశానని చెప్పారు.
- Advertisement -