బెల్లంకొండ సాయి శ్రీనివాస్-కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కవచం. మామిళ్ళ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం తాజాగా సాంగ్‌ని విడుదల చేసింది.
వస్తావా పిల్లా అనే సాంగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో కాజల్, మెహరీన్‌లు గ్లామరస్‌గా కనిపిస్తుండగా, శ్రీనివాస్ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఛోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది.
కెరీర్‌లో తొలిసారి బెల్లంకొండ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. చిత్రంలో హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలకపాత్రల్లో నటించారు. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని(నాని) నిర్మించగా తమన్ చిత్రానికి సంగీతం అందించారు.