ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను నియమించినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న నన్నపనేని రాజకుమారి పదవికాలం ఇంకా రెండేళ్లు ఉండగానే తన పదవీకి రాజీనామా చేశారు. ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో నన్నపనేని రాజీనామా చేయగా వాసిరెడ్డి పద్మను కొత్త చైర్ పర్సన్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజకుమారి స్థానంలో అదే వర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మను నియమించారు జగన్. వైసీపీ అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టిన వాసిరెడ్డి పద్మ పార్టీ వాయిస్‌ని బలంగా వినిపించారు. విధేయత, సామాజిక వర్గం కోణంలో ఆమెకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి దక్కిందని భావిస్తున్నారు.