- Advertisement -
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. తమిళ మూవీ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తిని రేకెత్తించడానికి మూవీ ప్రీ-టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ క్రమంలో వాల్మీకి ప్రీ రిలీజ్ టీజర్ ని జూన్ 24 సాయంత్రం 5:18ని.లకి విడుదల చేయబోతున్నట్టు టీం పోస్టర్ ద్వారా ప్రకటించింది. వాల్మీకి చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.
- Advertisement -