వరుణ్ తేజ్ ‘గని’ మళ్లీ వాయిదా..

116
- Advertisement -

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’.ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇదివరకు విడుదలైన గని టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. అయితే పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ అదే రోజున వస్తుండడంతో.. ఈ సినిమా విడుదలను మళ్లీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలోని మేకోవర్ కోసం వరుణ్ జిమ్ లో గంటతరబడి కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బిల్డ్ చేశాడు. బాక్సింగే తన జీవిత ధ్యేయంగా ఉండే ఒక యువకుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఛాంపియన్ గా మారడమే ఈ సినిమా కథాంశం. గణేశ్ అలియాస్ గనిగా వరుణ్ తేజ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇందులో వరుణ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ నదియా నటిస్తుండగా.. నరేశ్, నవీన్ చంద్ర, ఉపేంద్ర, జగపతి బాబు, తనికెళ్ళ భరణి, సునీల్ శెట్టి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -