పూరికి విషెస్ చెప్పిన వరుణ్..

208
Varun tej tweet to puri jagannadh
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. ఆయన తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా నేహాశెట్టి హీరోయిన్‌గా ఇందులో నటించారు. 1971లో ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలకు సిద్దమైంది.

 Varun tej tweet to puri jagannadh

శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌లో నిర్మించాడు పూరి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలె విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది. ఇందులో ఆకాష్‌ నటన డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పూరి లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలకు పెట్టుకుని రూపందించారు. ఏకంగా ఈ మూవీ కోసం తన ఆస్తులను సైతం అమ్ముకుని చాలా ఇష్టంతో తెరకెక్కించాడు.

ఈ సినిమాకు ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలందుతున్నాయి. ఇది పూరి సినిమాల్లో ప్రత్యేకమైన సినిమా అని ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని పలువురు ప్రశంసించారు. ఈ చిత్రం నేడు విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా పూరి జగన్నాథ్‌కు ట్విట్టర్ వేదికగా విషేష్ చెప్పాడు మెగా హీరో వరుణ్‌ తేజ్. ‘‘మెహబూబా మూవీ ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా నా డార్లింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఆకాష్ గొప్ప మలుపునిస్తుందని ఆశిస్తున్నా’’ అంటూ వరుణ్ ట్వీట్ చేశాడు. గతంలో వరుణ్‌ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

- Advertisement -