రూటు మార్చిన మెగాహీరో‌..

199
Varun Tej to Play an Astronaut in His Next Film
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్‌ ‘ఫిదా’ తర్వాత ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇంటెలిజెంట్ – గాయత్రి సినిమాల పాటు విడుదలై… ఈ సినిమా ఒక్కటే హిట్ కొట్టింది. ఇందులో లవర్ బాయ్‌గా ఆకట్టుకున్నాడు వరుణ్. ఫిదాలో కూడా సున్నిత మనస్సున్న యువకుడిగా లవర్‌ బాయ్‌గా నటించి మెప్పించాడు. ఈ రెండు సినిమాల్లో లవర్‌ బాయ్‌గా నటించిన వరుణ్‌ తరువాత చేయబోయే సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని సమాచారం.

Varun Tej to Play an Astronaut in His Next Film

వరుణ్‌ తర్వత సినిమా ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఉండబోతున్న విషయం తెలిసిందే. వరుణ్ కోసం ఓ స్పేస్ కథను సిద్ధం చేశాడు దర్శకుడు సంకల్ప్‌. ఆ సినిమాలో ఎక్కువ భాగం గురుత్వాకర్షణ శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో (జీరో గ్రావిటీ) జరుగుతుంది. అలా జీరో గ్రావిటీ పరిస్థితుల్లో నటించేందుకు వరుణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. ఇందుకోసం కజకిస్థాన్ వెళ్లబోతున్నారు వరుణ్ – సంకల్స్ రెడ్డి. వచ్చేనెలలో వెళ్లి అక్కడ నెల రోజుల పాటూ ఉండి జీరో గ్రావిటీలో ఎలా నటించాలో తెలుసుకుని వస్తారట.

మన తెలుగు హీరోలు సాధారణంలో ఇలా ట్రైనింగ్ లేవీ తీసుకోకుండానే నటిస్తారు. ఏ పాత్ర అయినా అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా చేసేస్తారు. కానీ వరుణ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. పద్దతి ప్రకారం చేయడానికి ఇష్టపడుతున్నట్టున్నాడు. వరణ్‌ ఈ మూవీతో మరో హిట్‌ కోట్టాలని బాగానే కష్టపడుతున్నాడు. మరి ఈ మూవీ కూడా హిట్టైతే వరుణ్‌కు హ్యట్రిక్‌ పడ్డటే.

- Advertisement -