- Advertisement -
మెగా హీరో వరుణ్ తేజ్ తన పెళ్లిపై స్పందించాడు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్‌గా పేరొందిన ప్రభాస్, నితిన్‌లు వివాహం చేసుకున్న తరువాత తాను పెళ్లి చేసుకుంటానని వరుణ్ చెప్పుకొచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన తొలిప్రేమ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘తొలిప్రేమ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న వరుణ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై మాట్లాడాడు.
ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించేంత సమయం లేదని, సినిమాలతోనే తన వివాహం అయిపోయిందని వ్యాఖ్యానించాడు. కాగా, త్వరలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో వరుణ్ నటించనున్నాడు. ఘాజి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ కొత్త సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నారు.
- Advertisement -