విభిన్న కథలతో సరికొత్తట్రెండ్ సెట్ చేస్తున్న హీరో వరుణ్‌తేజ్ . ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’లో నటిస్తున్న వరుణ్ తన నెక్ట్స్ సినిమాకు క్లాప్ కొట్టేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజ కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. ఈ సినిమాతో అట్లూరి వెంకీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
వరుణ్‌తేజ్ ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘అట్లూరి వెంకీ, థమన్, రాశీఖన్నాతో నా తర్వాతి చిత్రం కిక్ మొదలైంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అని ట్వీట్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి క్లాప్ కొట్టారు.
Kick started my next movie with @dirvenky_atluri ,@SVCCofficial ,@MusicThaman & Raashikhanna
Need all your love!.thanks!🙏🏼 pic.twitter.com/30VrWFYAcT— Varun Tej Konidela (@IAmVarunTej) June 17, 2017