‘తొలిప్రేమ’ దర్శకుడితో ‘గద్దలకొండ గణేశ్’

400
varun Tej Venky atluri
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన గద్దలకొండ గణేశ్(వాల్మీకి)తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈసినిమాను 14రీల్స్ బ్యానర్ పై తెరకెక్కించారు.

ఇక ఈమూవీ తర్వాత వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో వుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుణ్‌ తేజ్ తో సినిమా నిర్మించెందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈసినిమాకు తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. గతంలో వరుణ్ తేజ్ – వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ‘తొలిప్రేమ’ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ ను దిల్ రాజు మళ్లీ సెట్ చేసే పనిలో వున్నారని అంటున్నారు. ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

- Advertisement -