‘వాల్మీకి’.. టైటిల్ మార్చాలంటూ మహాధర్నా..!

436
- Advertisement -

వరుణ్‌తేజ్‌-హరీష్‌ శంకర్‌ తొలి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్మీకి’. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన జిగర్‌తాండ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే విధంగా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేస్తున్నారు.

Valmiki

అయితే ప్రస్తుతం ఈ సినిమాని వివాదాలు చుట్టు ముట్టాయని తెలుస్తోంది. వాల్మీకి పేరును మార్చాల్సిందేనని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వాల్మీకి పేరుతో తీసే సినిమాలో ఆధ్యాత్మికత ఉండాలని, కానీ ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాకు వాల్మీకి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. శుక్రవారం ఇందిరాపార్క్‌లో బోయహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సినిమా టైటిల్ మార్చాలంటూ వాల్మీకి బోయలు మహాధర్నా నిర్వహించారు.

R Krishnaiah

ఆర్.కృష్ణయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సినిమా పేరును మార్చాలంటూ ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పేరు మార్చకుంటే సినిమా యూనిట్‌పై కేసులు పెట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నారు చిత్ర బృందం.

- Advertisement -