వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్స్. తాజాగా….. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ వదిలిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.
ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన 21 గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. మిస్టర్ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందమైన ప్రేమ కథను… శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.
విదేశాల్లోని అందమైన లొకేషన్స్ ఈ టీజర్ కి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. “జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళుతుంది .. కానీ ప్రేమ .. జీవితం వున్న చోటుకే తీసుకెళ్తుంది”. అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ బావుంది. “ఒక్కడు తోడుగా వుంటే చాలు .. వందమంది సైన్యంలా కాపాడతాడు” అంటూ లావణ్య త్రిపాఠి చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ టీజర్ అంచనాలను పెంచేదిగానే వుంది.
ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో… ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోషన్స్‌కి, హిలేరియస్ ఎంటర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువల్స్‌కు స్కోప్ ఉన్న కథ ఇది. స్పెయిన్‌లోని పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగళూర్, చాళకుడి, ఊటీ, హైదరాబాద్ ఏరియాల్లో ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయర్ ఆరు పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్, ప్రిన్స్,నాజర్, మురళీశర్మ, తనికెళ్ళభరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, నాగినీడు, హరీష్ ఉత్తమన్, నికితన్‌ధీర్, షఫీ, శ్రవణ్, మాస్టర్ భరత్, షేకింగ్ శేషు, ఈశ్వరిరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజస్విని తదితరులు నటించిన ఈ చిత్రానికి
ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, స్టైలింగ్ః రూప వైట్ల, లిరిక్స్ః కె.కె, రామజోగయ్య శాస్త్రి, కోడైరెక్టర్స్ః బుజ్జి, కిరణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ః కొత్తపల్లి మురళీకృష్ణ, కథః గోపీ మోహన్, మాటలుః శ్రీధర్ సీపాన, సంగీతంః మిక్కి జె.మేయర్, సినిమాటోగ్రఫీః కె.వి.గుహన్, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, నిర్మాతలుః నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – శ్రీనువైట్ల.